tnilive.com

అమెరికాలో మరో తెలుగు సంఘం పుట్టిందిగా…!

అమెరికాలో మరొక తెలుగు సంఘం ఆవిర్భవించింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళా నాయకత్వంలో ఈ తెలుగు సంఘం ఏర్పాటు కావటం విశేషం. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఝాన్సీరెడ్డి ఈ తెలుగు సంఘానికి శ్రీకారం చుట్టారు. ఊమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) పేరుతొ ఈ తెలుగు సంఘాన్ని నెలకొల్పారు. ఝాన్సీ రెడ్డి గతంలో టాటా వ్యవస్థాపక సభ్యుల్లో ప్రముఖులుగా ఉన్నారు. ఆ సంఘం అద్యక్ష పదవి కూడా నిర్వహించారు. టాటాలో ఇమడలేక ఆ తెలుగు సంఘం నుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం WETA పేరుతొ ఏర్పాటు చేసిన ఈ తెలుగు సంఘంలో మహిళలకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందనటంలో సందేహం లేదు. ఇది కేవలం ప్రవాస తెలుగు మహిళల కోసం ఏర్పాటు చేసిన సంఘంగా లోగోలో పేర్కొనటం మరో విశేషం.

Link: Read on the web

Donate

Newsletter